తల్లి, మైనర్‌ కూతురిపై అత్యాచారం

ఉద్యోగం ఇస్తామని ఆశ చూపి మహిళను, తన నాలుగేళ్ల కూతురిని పలువురు అత్యాచారం చేసిన పైశాచిక ఘటన పాకిస్థాన్‌లోని కశ్మోర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల మేరకు.. నెలకు రూ. 40 జీతం వచ్చే ఉద్యోగం

Updated : 13 Nov 2020 13:46 IST

పాకిస్థాన్‌లో ఉద్యోగం ఆశచూపి పైశాచికం

 

ఇస్లామాబాద్‌ : ఉద్యోగం ఇస్తామని ఆశ చూపి మహిళను, ఆమె నాలుగేళ్ల కూతురిని పలువురు అత్యాచారం చేసిన పైశాచిక ఘటన పాకిస్థాన్‌లోని కశ్మోర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల మేరకు.. నెలకు రూ. 40 వేల జీతం వచ్చే ఉద్యోగం ఇస్తామని ఓ మహిళను పిలిపించుకున్న కొందరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మహిళతో పాటు తనతో ఉన్న చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ దుర్మార్గులు అమ్మాయిల విక్రేతకు అమ్మేశారు. 

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, కూతురిని విక్రేత వద్ద నుంచి విడిపించి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. 

 

  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని