ఆ కారును ఆయనకు ఇవ్వండి.. దొంగల లేఖ!

మహారాష్ట్రలోని పుణెలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భీమా కొరేగావ్‌లో అపహరణకు గురైన కారు పక్క ఊర్లో దొరకడమే కాకుండా.. దొరికిన వారు దాన్ని సంబంధిత యజమానికి అప్పగించాలని దొంగలు అందులో లేఖ వదిలివెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Published : 13 Oct 2020 01:22 IST

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భీమా కొరేగావ్‌లో అపహరణకు గురైన కారు పక్క ఊర్లో దొరకడమే కాకుండా.. దొరికిన వారు దాన్ని సంబంధిత యజమానికి అప్పగించాలని దొంగలు అందులో లేఖ వదిలివెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ లేఖలో కారు యజమాని వివరాలను సైతం పొందుపర్చారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని శిఖర్‌పూర్‌ పోలీసులు వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన విజయ్‌ గవానే ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతున్నాడు. ఇటీవల తన డ్రైవర్‌ ఒకరు కారును తీసుకువెళ్లి భీమా కొరేగావ్‌లోని ఇంటి ముందు పార్క్‌ చేశాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలు ధ్వంసం చేసి ఆ కారుతో పరారైనట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. కాగా వారు దొరక్కుండా అందులోని జీపీఎస్‌ వ్యవస్థను సైతం నిలిపివేశారు. కానీ ఇంతలోనే వారు మనసు మార్చుకున్నారు. చోరీ చేసిన కారును సమీపంలోని అహ్మద్‌నగర్‌లో వదిలివెళ్లారు. అంతేకాకుండా వారు అందులో ఓ లేఖను పెట్టి వెళ్లారు.‘ఈ కారును సంబంధిత ట్రావెల్‌ యజమానికి అందించాలి’అని పేర్కొంటూ ఆయన వివరాలు రాశారు. దీంతో ఆశ్చర్యానికి గురైన పోలీసులు కారును ఆ యజమానిని సమాచారం అందించారు. కాగా దొంగలు కారులో బాధితుడికి చెందిన రూ.55వేల విలువ చేసే సామగ్రిని దోచుకుపోయారని పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని