Smuggling: రూ.2000 కోసం.. 2 కేజీల బంగారం సరిహద్దులు దాటించి..!
బంగారు కడ్డీల(Gold Bars)ను అక్రమ రవాణా చేస్తూ పశ్చిమ్ బెంగాల్‌లో ఓ మహిళ బీఎస్‌ఎఫ్‌కు పట్టుబడింది. బంగ్లాదేశ్(Bangladesh) నుంచి ఈ అక్రమ రవాణా జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
(ప్రతీకాత్మక చిత్రం)
కోల్‌కతా: బంగ్లాదేశ్ (Bangladesh ) నుంచి భారత్‌కు బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ మహిళ పట్టుబడింది. రెండు కేజీల బరువున్న 27 బంగారు కడ్డీలు(Gold Bars)తరలిస్తూ సరిహద్దు భద్రతా దళాని(BSF)కి చిక్కింది. రూ. రెండు వేల కోసం దాదాపు రూ.1.29 కోట్ల ఆ మొత్తాన్ని సరిహద్దులు దాటించేందుకు యత్నించింది.
అక్రమ రవాణాకు పాల్పడిన ఆ మహిళ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు చెందిన వ్యక్తి. దుస్తుల్లో బంగారు కడ్డీలను ఉంచి వాటిని నడుము చుట్టూ కట్టుకొని బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకుంది. ఈ క్రమంలో బంగారం తీసుకొని ఒక స్మగ్లర్ సరిహద్దులు దాటారని బీఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే మహిళా సిబ్బంది పశ్చిమ బెంగాల్(West Bengal)లోని 24 పరగణాల జిల్లాలో ఆమెను అరెస్టు చేశారు. తనిఖీలు చేయగా.. ఆమె వద్ద బంగారాన్ని గుర్తించారు. బెంగాల్‌లోని బరాసత్ ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తికి ఈ బంగారం అందించాలని తనకు ఆదేశాలు ఇచ్చినట్లు.. రూ.2వేల కోసం మొదటిసారి ఈ పనిలోకి దిగినట్లు విచారణలో సదరు మహిళ వెల్లడించింది. ప్రస్తుతం ఈ బంగారాన్ని కస్టమ్ అధికారులకు అప్పగించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ