Hyderabad News: ప్రవాస భారతీయుడి ఫిర్యాదు.. అంబర్‌పేట సీఐ సుధాకర్‌ అరెస్టు

ప్రవాస భారతీయుడిని మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో అంబర్‌పేట సీఐ సుధాకర్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 13 Jan 2023 18:35 IST

హైదరాబాద్‌: అంబర్‌పేట సీఐ సుధాకర్‌ అరెస్టయ్యారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో సుధాకర్‌ను రిమాండ్‌కు తరలించనున్నారు. కొన్ని రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో సీఐ సుధాకర్‌పై కేసు నమోదైంది. ఓ ప్రవాస భారతీయుడికి భూమి ఇస్తానని సీఐ సుధాకర్‌ రూ.50లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ భూమి విక్రయిస్తామని డబ్బులు తీసుకున్నప్పటికీ నెలలు గడుస్తున్నా భూమి రిజిస్ట్రేషన్‌ చేయలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని