Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం.. ఆస్తికోసం తమ్ముడిని చంపిన అన్న
తోడపుట్టిన తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాల గ్రామంలో జరిగింది.
మద్నూర్: తోడపుట్టిన తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయ్ పాటిల్ అతని అన్న రాజుకు మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి విజయ్‌పాటిల్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాజు కత్తితో దాడి చేసి హతమార్చాడు. పదేళ్ల క్రితం రాజు.. పెద్దన్నను మహారాష్ట్రలో హత్య చేశాడని, ఇప్పుడు తమ్ముడిని హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు రాజు హైదరాబాద్‌లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడని స్థానికులు తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, బిచ్కుంద సీఐ కృష్ణ , మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి