విచారణకు వెళ్లిన పోలీసును కొట్టి చంపారు! 

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన పోలీస్‌ అధికారి బైక్‌ చోరీ కేసు విషయమై బెంగాల్‌ వెళ్లగా.. అక్కడ ఓ గ్రామస్థులు ఆయన్ను కొట్టి చంపడం కలకలం సృష్టించింది. 

Published : 11 Apr 2021 02:05 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి బైక్‌ చోరీ కేసులో దర్యాప్తు కోసం వెళ్లగా.. అక్కడి స్థానికులు ఆయన్ని కొట్టి చంపడం కలకలం సృష్టించింది.

బిహార్‌కు చెందిన అశ్వనీ కుమార్‌ కిషన్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌస్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఓ బైక్‌ చోరీ కేసు గురించి ఆరా తీయడం కోసం ఆయన బెంగాల్‌లోని ఉత్తర్‌ దినాజ్‌పూర్‌ జిల్లాకు వెళ్లారు. పంజిపరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. ఆయన గోల్‌ పొఖారా ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లగా.. సదరు గ్రామస్థులు అశ్వనీకుమార్‌పై రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని పూర్ణియా రేంజ్‌ ఐజీ తెలిపారు. పంజిపరాలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై బిహార్‌ పోలీసులు స్పందిస్తూ.. కేసు విచారణ నిమిత్తం బెంగాల్‌ వెళ్లిన అశ్వనీ కుమార్‌ స్థానిక పోలీసుల సహకారం కోరారు. కానీ బెంగాల్‌ పోలీసులు అతడి వెంట బృందాన్ని పంపడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని