డీకే అరుణ కుమార్తె క్రెడిట్‌ కార్డు చోరీ.. రూ.11 లక్షలు మాయం

భాజపా నాయకురాలు డీకే అరుణ కుమార్తె డీకే శ్రుతిరెడ్డి క్రెడిట్ కార్డు చోరీ చేసి నగదు కాజేసిన డ్రైవరుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు-14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఆమె నివసిస్తున్నారు.

Published : 07 Jul 2023 09:54 IST

జూబ్లీహిల్స్: భాజపా నాయకురాలు డీకే అరుణ కుమార్తె డీకే శ్రుతిరెడ్డి క్రెడిట్ కార్డు చోరీ చేసి నగదు కాజేసిన డ్రైవరుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు-14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఆమె నివసిస్తున్నారు. డ్రైవరుగా పనిచేస్తున్న బీసన్న ఇంట్లో పెట్టిన హెచ్ డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును అపహరించాడు. శ్రుతిరెడ్డికి తెలిసిన మహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్ ఆభరణాల దుకాణానికి వెళ్లి రూ.11 లక్షలు డ్రా చేసి తన వద్ద పెట్టుకున్నాడు. గుర్తించిన ఆమె డ్రైవర్‌ను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. బుధవారం రాత్రి బంజారా హిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని