Vijayawada: విజయవాడ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం

నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు.

Updated : 24 Mar 2024 10:26 IST

విజయవాడ: నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. వేకువజామున 4 గంటల ప్రాంతంలో అక్కడి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మద్యం తాగిన యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ బస్టాండ్‌లోని బెంచీలను ఆక్రమించుకుని నిద్రించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈక్రమంలో నిద్ర లేపడానికి ప్రయత్నించగా వారిపై దాడికి దిగారు. దాడి చేసేందుకు ఒక్కసారిగా సుమారు వందమందికి పైగా దూసుకువచ్చారు. 

బ్లేడ్లతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ ఘటనలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం అదనపు పోలీసుల రాకతో నిందితులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. రైల్వేస్టేషన్‌లోకి యాచకులు, బ్లేడ్ బ్యాచ్‌ను రానివ్వకపోవడంతో వారంతా బస్టాండ్‌కు వస్తున్నారు. అక్కడి నుంచి తమను బయటకు పంపడాన్ని నిరసిస్తూ వారు దాడికి దిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని