Guntur: ఐటీ అధికారులమంటూ డబ్బు, బంగారంతో పరారీ.. గుంటూరులో ఘరానా మోసం

ఐటీ అధికారుల పేరు చెప్పి గుంటూరులో ఘరానా మోసానికి పాల్పడ్డారు నిందితులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 23 Feb 2023 17:45 IST

గుంటూరు: ఐటీ అధికారుల పేరు చెప్పి గుంటూరులో ఘరానా మోసానికి పాల్పడ్డారు నిందితులు. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాత గుంటూరు ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్న యర్రంశెట్టి కల్యాణి ఇంటికి కారులో గురువారం ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తాము ఐటీ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చి సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను చెల్లించకుండా భారీగా బకాయి ఉన్నారంటూ ఆస్తిపత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. గుర్తింపు కార్డులు చూపించాలని కల్యాణి నిలదీయడంతో ఆమెను తుపాకీతో బెదిరించి డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు తీసుకుని ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. వెంటనే బాధితురాలు పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని