నల్గొండలో చిక్కిన చిరుత మృతి

నల్గొండ జిల్లా అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి చెందింది. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల క్యూరేటర్‌ తెలిపారు. మరణించిన చిరుతకు..

Updated : 28 May 2020 23:38 IST

మర్రిగూడ: నల్గొండ జిల్లా అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి చెందింది. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల క్యూరేటర్‌ తెలిపారు. మరణించిన చిరుతకు హైదరాబాద్‌లో పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజిపేట తండా వద్ద ముళ్లకంచెలో చిక్కుకున్న చిరుతను గ్రామస్థుల సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది ముళ్ల కంచె నుంచి బయటకు తీసిన విషయం తెలిసిందే. చిరుతను బయటకు తీసే క్రమంలో అటవీశాఖ సిబ్బందిపై చిరుత దాడి చేయడంతో ఇద్దరు అటవీశాఖ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని