నా భర్త తప్పు చేశాడు.. ఈ శిక్షకు అర్హుడే

ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అతడి కుటుంబసభ్యులు స్పందించారు. తగిన శిక్ష పడిందని పోలీసు చర్యను వారు సమర్థించారు.

Published : 12 Jul 2020 01:45 IST

పోలీసు చర్యను సమర్థించిన వికాస్‌ దుబే భార్య

కాన్పూర్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అతడి కుటుంబసభ్యులు స్పందించారు. తగిన శిక్ష పడిందని పోలీసు చర్యను వారు సమర్థించారు.

వికాస్‌ దుబే అంత్యక్రియల్లో పాల్గొన అతడి భార్య రిచా దుబే మాట్లాడుతూ.. ‘నా భర్త తప్పు చేశాడు.. ఈ శిక్షకు అర్హుడే’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గ్యాంగ్‌స్టర్‌ అంత్యక్రియలు కాన్పూర్‌లోని భైరవ్‌ ఘాట్‌లో నిర్వహించారు. భార్య, చిన్న కొడుకు, బావమరిది తప్ప ఇతర కుటుంబసభ్యులు హాజరుకాలేదు.

‘ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు సరైన చర్యే తీసుకున్నారు. నా కుమారుడు ఎనిమిది మంది పోలీసులను చంపేశాడు. ఇది క్షమించరాని నేరం. ముందు నుంచి మా మాట వినుంటే అతడి జీవితం ఇలా ముగిసేది కాదు. మాకు ఏవిధంగాను అతడు సహకరించలేదు. అతడి కారణంగా మా పూర్వీకుల ఆస్తి నేలమట్టమైంది. ఈ శిక్ష అతడికి సరైనదే. అలా చేయకపోతే రేపు ఇతరులు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తారు’ అని వికాస్‌ దుబే తండ్రి రామ్‌కుమార్‌ దూబే అన్నారు.

తనను అరెస్టు చేయడానికి వస్తున్న 8 మంది పోలీసులను ఒక పథకం ప్రకారం దారుణంగా కాల్చి చంపించిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను.. శుక్రవారం కాన్పుర్‌ శివార్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని