Crime News: అరటి పండ్ల లోడ్‌లో 110కిలోల గంజాయి.. ఎల్బీనగర్‌ వద్ద పట్టివేత

ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను

Updated : 29 Oct 2021 17:12 IST

హైదరాబాద్‌: ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరం మీదుగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు తరలిస్తున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) మహేశ్‌ భగవత్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. 

గంజాయి పట్టుకునేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని.. ఈ క్రమంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నాగ్‌పుర్‌కు రవాణా చేస్తున్న మొత్తం 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. దీని విలువ సుమారు రూ.18.50లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అరటి పండ్ల లోడ్‌లో గంజాయి తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. ‘‘డ్రగ్స్‌ నివారణకు ‘నయా సవేరా’ కార్యక్రమంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో, అమృత ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్నాం. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ డ్రగ్స్‌ నివారణపై అవగాహన కల్పిస్తున్నాం’’ అని మహేశ్‌ భగవత్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని