అనిశా వలలో ఆదిలాబాద్‌ జిల్లా ఉపాధి కల్పనాధికారి

ఆసుపత్రికి సంబంధించి రోగుల రక్షణ సిబ్బంది నియామకం విషయంలో లేబర్‌ కాంట్రాక్ట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు జిల్లా ఉపాధి కార్యాలయ ఉద్యోగులతో పాటు రిమ్స్‌ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు.

Published : 01 Feb 2023 04:18 IST

మరో ఇద్దరు ఉద్యోగులు సైతం..

ఆదిలాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆసుపత్రికి సంబంధించి రోగుల రక్షణ సిబ్బంది నియామకం విషయంలో లేబర్‌ కాంట్రాక్ట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు జిల్లా ఉపాధి కార్యాలయ ఉద్యోగులతో పాటు రిమ్స్‌ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం ఎస్సీ లేబర్‌ కాంట్రాక్ట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 24 మంది పేషెంట్‌ కేర్‌ సిబ్బందిని నియమించాల్సి ఉంది. దీనికి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం నుంచి అలాట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వటానికి ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్‌ రూ.3 లక్షలు డిమాండ్‌ చేశారు. ఇది నచ్చని సొసైటీ బాధ్యుడు దుర్గం శేఖర్‌ గత నెల 25న అనిశా అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు ఆయన ఉపాధి కల్పనాధికారితో రూ.2.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారం శేఖర్‌ ఉపాధి కల్పనా కార్యాలయంలో రిమ్స్‌ జూనియర్‌ అసిస్టెంట్ తేజ, సహాయ ఉపాధి కల్పనాధికారి విజయలక్ష్మిలకు నగదు ఇస్తుండగా అనిశా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని