అమృతా ఫడణవీస్‌ను బెదిరించి.. రూ.10కోట్లు డిమాండ్
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతాకు రూ.కోటి ఇవ్వజూపిన డిజైనర్ అనిక్ష కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ముంబయి: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతాకు రూ.కోటి ఇవ్వజూపిన డిజైనర్ అనిక్ష కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేసేందుకు తొలుత లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన అనిక్ష.. అది కుదరకపోవడంతో అమృతాను బెదిరించినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే అమృతకు చెందిన కొన్ని వీడియోలను వైరల్ చేస్తానని ఆ డిజైనర్ బెదిరించినట్లు తెలిపారు. దీంతో ఆమెపై తాజాగా బలవంతపు వసూళ్ల కేసు నమోదు చేశారు. అనిక్షపై ఇప్పటికే అమృతా బ్లాక్‌మెయిల్, బెదిరింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె తన తండ్రి అనిల్ జైసింఘానీకి సంబంధించిన క్రిమినల్ కేసులను మాఫీ చేయించేందుకు రూ.కోటి ఇవ్వజూపిందని అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు అమృత అంగీకరించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనిక్ష, ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైన రెండు రోజుల తర్వాత ఆ డిజైనర్.. అమృతకు రెండు వీడియోలను పంపింది. ఆ వీడియోల్లో డబ్బు ఉన్న బ్యాగును అమృతకు ఇస్తున్నట్లుగా ఉంది. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోలను వైరల్ చేస్తానని ఆమె అమృతను బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అవి మార్ఫింగ్ చేసినవిగా తేలినట్లు పేర్కన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Washington: వాషింగ్టన్లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్రను భగ్నం చేసిన సీక్రెట్ సర్వీస్
-
India News
Rahul Gandhi: పోలీసులు నిరాకరించినా.. ప్రారంభమైన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
-
Politics News
Anam: అక్కడంతా ఏకఛత్రాధిపత్యమే.. వాళ్లకి భజనపరులే కావాలి: ఆనం రామనారాయణరెడ్డి
-
Sports News
Shubman Gill: నేను సెలక్టర్నైనా.. అదే పని చేసేవాణ్ని: శిఖర్ ధావన్
-
India News
Amritpal Singh: ‘అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపో’.. అకాల్‌తక్త్ పిలుపు
-
World News
Putin: పుతిన్ కీలక నిర్ణయం.. బెలారస్లో అణ్వాయుధాల మోహరింపు