Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా కర్చన పోలీస్‌స్టేషన్ పరిధిలో పరువుహత్య కలకలం రేపుతోంది. కన్నతండ్రే కాలయముడై కుమార్తెను చంపేశాడు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా కర్చన పోలీస్‌స్టేషన్ పరిధిలో పరువుహత్య కలకలం రేపుతోంది. కన్నతండ్రే కాలయముడై కుమార్తెను చంపేశాడు. విద్యుదాఘాతంతో చనిపోయిందని అందరినీ నమ్మించి.. అంత్యక్రియలు పూర్తి చేశాడు. కర్చన సమీప హిందూబేలా గ్రామవాసి లల్లన్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె చాందినీ రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు వెదికి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఇరవై రోజుల క్రితం చాందినీ తన చెల్లి ఆసియాతో కలిసి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ముంబయిలో ఉన్నట్లు తెలుసుకొని.. ఇంటికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో చాందినీ ఓ యువకుడితో ప్రేమలో ఉందని తండ్రికి తెలిసింది. దీన్ని జీర్ణించుకోలేని లల్లన్.. ఆమెను గదిలో బంధించి చితకబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చాందినీ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్నకుమార్తె ఆసియాను తండ్రి బెదిరించాడు. విద్యుదాఘాతం సోకి చాందినీ చనిపోయిందని గ్రామస్థులను నమ్మించి శ్మశానంలో పూడ్చిపెట్టాడు. సోదరి మరణాన్ని జీర్ణించుకోలేని ఆసియా.. జరిగిన విషయాన్ని గ్రామస్థులకు చెప్పేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
Ap-top-news News
శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు