Wanaparthy: మార్ఫింగ్‌ ఫొటోలతో వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

మార్ఫింగ్‌ ఫొటోలతో రుణయాప్‌ నిర్వాహకులు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.

Published : 25 Oct 2022 02:42 IST

కొత్తకోట: మార్ఫింగ్‌ ఫొటోలతో రుణయాప్‌ నిర్వాహకులు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తకోటకు చెందిన శేఖర్‌ (35) ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుండేవాడు. ఈ క్రమంలో లోన్‌ యాప్‌ల గురించి తెలుసుకున్నాడు. అందులో అప్పు తీసుకుని కొంత కాలం తర్వాత తిరిగి చెల్లించాడు. 

అయినప్పటికీ ఇంకా వడ్డీ చెల్లించాల్సి ఉందంటూ లోన్‌ యాప్‌ నిర్వాహకులు శేఖర్‌ను వేధించడం మొదలు పెట్టారు. చివరకు శేఖర్‌ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఈ ఉదయం తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై నాగశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని