Crime: పర్యాటక ప్రదేశానికి భార్యను తీసుకెళ్లి.. తోసేసి

వివరాల్లోకి వెళ్లితే...దిల్లీ వాసి రాజేష్‌ రాయ్‌(29) బబిత(24) అనే మహిళపై గతేడాది అత్యాచారం చేశాడు. దీంతో గతేడాది జూన్‌లో బబిత పోలీసులను ఆశ్రయించింది.

Published : 28 Jul 2021 01:36 IST

భార్య మృతి.. భర్త అరెస్టు

దిల్లీ: భార్యా భర్తలు ఎవరైనా పర్యాటక ప్రదేశానికి వెళ్తే ఆహ్లాదంగా గడుపుతారు. ఇక్కడో ప్రబుద్ధుడు మాత్రం భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.. ఆమెతో ఘర్షణకు దిగి.. కొండమీద నుంచి తోసేసి.. ఆమె పాలిట యముడయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే...దిల్లీ వాసి రాజేష్‌రాయ్‌(29) బబిత(24) అనే మహిళపై గతేడాది అత్యాచారం చేశాడు. దీంతో  బబిత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టులో రాజేష్‌ను అరెస్టు చేసి జైలుకి పంపారు. ఇంతలో బబిత మనసు మార్చుకొని... వెంటనే కేసుని వెనక్కుతీసుకుంది.అనంతరం అతడు జైలు నుంచి విడుదలయ్యాక తన ప్రేమను వెల్లడించింది.. ఇద్దరు పరస్పరం అంగీకారానికి వచ్చి పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లకు ఆమెకు అతని నుంచి వేధింపులు మొదలయ్యాయి. శారీరకంగానూ ఆమెను చిత్రహింసకు గురిచేశాడు. బాధ భరించేలేక మళ్లీ పుట్టింటికి వచ్చేసింది . కొన్ని రోజులకు రాజేష్‌ తన వద్దకు వచ్చేయాలని కోరాడు. ఈ ఏడాది జూన్‌11న ఆమెను ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లోని గ్రామానికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆమె ఫొన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో బబిత కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే దిల్లీ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే విచారణ మొదలుపెట్టిన పోలీసులు.. రాజేష్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా..  కొండమీద నుంచి తోసేసినట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఆమె మృతదేహం కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని