Telangana news: సిద్దిపేట కాల్పుల ఘటన.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు..

సిద్దిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పట్టపగలే తుపాకీతో కాల్పులు జరిపి రూ.43.50లక్షలు దోచుకెళ్లిన ఘటనలో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.

Published : 02 Feb 2022 01:13 IST

సిద్దిపేట: సిద్దిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పట్టపగలే తుపాకీతో కాల్పులు జరిపి రూ.43.50లక్షలు దోచుకెళ్లిన ఘటనలో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. వీరికి అదనంగా మరో 15 బృందాలు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దాడికి ఉపయోగించిన తుపాకీ కారులోనే డోరుకు, సీటుకు మధ్య ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తుపాకీ స్థానికంగా తయారు చేసిన అక్రమ ఆయుధమని తెలుస్తోంది. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా దర్యాప్తు బృందాలకు కమిషనర్ శ్వేత దిశానిర్దేశం చేస్తున్నారు. చరవాణి సిగ్నళ్ల తో పాటు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. వీటి ఆధారంగా దుండగులు రాజీవ్ రహదారి గుండా హైదరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దుండగులకు సంబంధించి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు.. ఈ రోజు వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని