Gujarat: విహారయాత్రలో విషాదం.. 16 మంది పాఠశాల విద్యార్థులు మృతి

విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులు ప్రయాణిస్తున్న పడవ తిరగబడటంతో 16 మంది విద్యార్థులు మృతి చెందారు.

Updated : 18 Jan 2024 20:26 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ (Gujarat)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని సరస్సులో పడవ తిరగబడటంతో 16 మంది పాఠశాల విద్యార్థులు సహా ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ప్రమాద సమయంలో అందులో 27 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గురువారం వడోదరలోని ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లింది.  స్థానికంగా ఉన్న హరిణి సరస్సులో 27 మంది విద్యార్థులు  ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు సహా ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిలో కొంత మందిని బోటింగ్ సంస్థ సిబ్బంది రక్షించారు. ప్రమాద ప్రాంతంలో అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పడవలో ఉన్నవారిలో ఎవరూ లైఫ్‌ జాకెట్‌ ధరించలేదని తెలిపారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని