Crime News: స్లీపర్‌ బస్సులో బాలికపై అత్యాచారం

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణాలకు తెరపడట్లేదు. 15 ఏళ్ల బాలిక తన తల్లి, కుటుంబసభ్యులతో బదర్‌పుర్‌ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్‌ బస్సు ఎక్కింది.

Updated : 22 Sep 2021 09:37 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం

ఫిరోజాబాద్‌, అలీగఢ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణాలకు తెరపడట్లేదు. 15 ఏళ్ల బాలిక తన తల్లి, కుటుంబసభ్యులతో బదర్‌పుర్‌ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్‌ బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో బస్సు ఆగినప్పుడు.. ఆమె కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కిందకు దిగారు. ఆ సమయంలో కండక్టర్‌ బబ్లూ సహచరుడు అషు.. బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘోరాన్ని ఆమె తన తల్లికి వివరించింది. బస్సును ఆపేందుకు తల్లి ప్రయత్నించగా బబ్లూ ఆమెను లాగి పడేశాడు. అనంతరం బబ్లూ, అషు బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై శిఖోహాబాద్‌ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అషును అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని