Kangana Ranaut: నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదు

రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టడంతో నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది.

Published : 24 Nov 2021 01:29 IST

ముంబయి: రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టడంతో నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. భారత స్వాతంత్ర్యం గురించి ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని