Hyderabad News: బాలికపై లైంగిక దాడి.. హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష

దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డుకు నాంపల్లి న్యాయస్థానం 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. సీసీఎస్‌లో హోంగార్డుగా

Updated : 03 Aug 2021 20:28 IST

హైదరాబాద్: దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డుకు నాంపల్లి న్యాయస్థానం 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. సీసీఎస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మల్లికార్జున్ గత ఏడాది అక్టోబరులో హైదరాబాద్‌లోని తుకారంగేట్‌ ప్రాంతంలో నివసించే మైనర్‌ బాలిక ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేశాడు. రెండు సార్లు లైంగిక దాడి చేసిన హోంగార్డు మల్లికార్జున్‌ .. విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాలికను బెదిరించాడు. అనంతరం 5నెలల తర్వాత బాలిక గర్భం దాల్చడంతో లైంగిక దాడి విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మల్లికార్జున్‌ను అరెస్టు చేశారు. నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్టు నేరం రుజువుకావడంతో 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దోషికి రూ.50 వేలు జరిమానా విధించిన కోర్టు.. అందులో నుంచి రూ.40 వేలు బాధితురాలికి చెల్లించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని