‘నగ్న చిత్రాలు పంపండి’ అంటూ అమ్మాయిలకు బెదిరింపులు.. యువకుడి అరెస్టు

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులను మోసం చేస్తున్న అజయ్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ప్రొఫైల్‌ ఫొటోతో ఖాతా తెరిచిన అజయ్.. అమ్మాయిగా...

Published : 24 Dec 2021 01:11 IST

హైదరాబాద్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులను మోసం చేస్తున్న అజయ్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ప్రొఫైల్‌ ఫొటోతో ఖాతా తెరిచిన అజయ్.. అమ్మాయిగా పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడినట్లు తేలింది. యువకుడిని అమ్మాయిగా భావించిన యువతులు వారి ఫొటోలను పంపించారు. ఫొటోలతో అజయ్‌ వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. వారి నగ్న చిత్రాలు పంపించకపోతే మార్ఫింగ్‌ చేస్తానని.. కోరిక తీర్చకపోతే మార్ఫింగ్‌ చేసిన చిత్రాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు 15 రోజుల క్రితం అజయ్‌పై సైబర్‌ క్రైం పోలీసులకు నగరానికి చెందిన యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్‌సుఖ్‌నగర్‌లో అజయ్‌ని అరెస్టు చేశారు. నిందితుడు అజయ్‌ వరంగల్‌ జిల్లా పరకాల వాసిగా పోలీసులు గుర్తించారు. అజయ్‌ హైదరాబాద్‌లో మల్టీమీడియా కోర్సు చేస్తున్నాడు. అజయ్‌ ఇప్పటివరకు చాలా మంది యువతులను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని