TSPSC: గ్రూప్‌-1 పేపర్‌నూ ప్రవీణ్‌ లీక్‌ చేశాడా?.. వెలుగులోకి కొత్త విషయాలు

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించిన మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

Updated : 14 Mar 2023 14:09 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించిన మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు గ్రూప్‌-1 పరీక్ష రాసినట్లు వెల్లడైంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పేపర్‌ను అతడు లీక్‌చేశాడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 

ప్రవీణ్‌ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్‌ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్‌ను సైబర్‌ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పేపర్‌ లీక్‌ అయిందా? లేదా? అనే కోణంలో సైబర్‌ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్‌కి 150కి గానూ 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాటవాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని