Crime News: దిల్లీ నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌... కొనుగోలు చేసిన 17మంది కోసం వేట

దిల్లీ కేంద్రంగా కొకైన్‌ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ నార్కొటిక్‌ వింగ్‌ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఇద్దరు నిందితులు హెర్నీ చిగ్బో ఉమేబ్యునై,

Updated : 29 Jun 2022 19:34 IST

హైదరాబాద్‌: దిల్లీ కేంద్రంగా కొకైన్‌ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ నార్కొటిక్‌ వింగ్‌ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఇద్దరు నిందితులు హెర్నీ చిగ్బో ఉమేబ్యునై, యాంబి చువోడిలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువ చేసే 20గ్రాముల కొకైన్‌, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్‌లో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో దిల్లీ నుంచి డ్రగ్స్‌ను ఆర్డర్‌పై సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న డివైన్‌ సుజీ.. ఇద్దరు నిందితులకు కొకైన్‌ సప్లై చేస్తున్నట్టు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వివరించారు. ఇటీవల విమానాశ్రయం డీఆర్‌ఐ స్వాధీనం చేసుకున్న కొకైన్‌ కేసుకు డివైన్‌ సుజికి సంబంధాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ముఠాలోని యాంబి చివోడి అనే నిందితుడు గతంలో బెంగళూరులో పట్టుబడగా అతని పాస్‌పోర్టు సీజ్‌ అయినట్టు తెలిపారు. నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లలో రహస్య కోడ్‌ భాషతో వినియోగదారులకు కొకైన్‌ సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. వీరి నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసిన 17మంది వినియోగదారులను గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నట్టు సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని