
crime news: అమానవీయం! వివస్త్రను చేసి.. ఊరేగించి!
రాంచీ: జార్ఖండ్‌లోని డుంకా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నెరుపుతున్నారనే కారణంగా ఓ మహిళ, పురుషుడిని నగ్నంగా ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 60 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. డుంకా జిల్లా బడ్తల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఓ నేరం కేసులో ఆమె భర్త ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.
సదరు యువకుడు మంగళవారం ఆ మహిళ ఇంటికి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని బంధించారు. అనంతరం వారిద్దరినీ నగ్నంగా ఊరేగించారు. దాదాపు కిలోమీటరు మేర గ్రామం మొత్తం తిప్పారు. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో వారు రంగంలోకి దిగారు. ఈ దుశ్చర్యలో భాగమైన 60 మంది గ్రామస్థులపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.