logo

‘ఆదివాసీలు సంస్కృతిని మరవొద్దు’

ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోరాదని  జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం తిర్యాణి మండలం గడలపల్లిలో పాహండి కూపర్‌ లింగో జండా ముట్టిపూజకు

Published : 21 Jan 2022 02:38 IST


సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, చిత్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు

తిర్యాణి, న్యూస్‌టుడే: ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోరాదని  జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం తిర్యాణి మండలం గడలపల్లిలో పాహండి కూపర్‌ లింగో జండా ముట్టిపూజకు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ముందుగా గిరిజన సంప్రదాయ బద్ధంగా పావన్‌ మడుగులో దేవతా మూర్తులకు పూజలు నిర్వహించి సమావేశ ప్రదేశంలో ఏర్పాటు చేసిన జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే సక్కు మాట్లాడుతూ.. గ్రామాల్లో గ్రామపటేల్‌ వ్యవస్థను తిరిగి పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల్లో మత మార్పిడి ప్రోత్సహించకుండా నివారించాలని, టీవీల్లో వచ్చే సీరియళ్లకు ఉన్న విలువ మన సంస్కృతిపై చూపడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి గిరిజనుడు తమ సంస్కృతిని కాపాడుకోవాల్సి సమయం అసన్నమైందన్నారు. పాత తరం అచరించిన విధంగా నేటి యువతకూడ అచరించాలని యువతకు పిలుపునిచ్చారు. చదువుతోనే ఆదివాసీ అభివృద్ధి ముడిపడిఉందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ చైర్మన్‌ కనక లక్కేరావు, గంధ్రాలయ చైర్మన్‌ కనక యాదవ్‌రావు, మాజీ ఎంపీ గేడం నగేష్‌, ఎంపీపీ మరుసుకోల శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌, నిర్వహణ కమిటీ సభ్యులు గుణవంతరావు, కేశవరావు, మోతిరాం, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, డీఏస్పీ శ్రీనివాస్‌, సీఐ సతీష్‌కుమార్‌, గ్రామాల పటేళ్లు, మహిళలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని