logo

వంద దాటిన కేసులు

జిల్లాలో గురువారం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సెంచరీ దాటింది. 2,316 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి 2,203 నమూనాలకు నిర్ధారణ పరీక్షలు చేయగా ఏకంగా 101 మంది పాజిటివ్‌ నివేదికలు

Published : 21 Jan 2022 02:38 IST

తాజాగా 101 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

నమూనాలు ఇవ్వటానికి రిమ్స్‌లో బారులు తీరిన అనుమానితులు

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే : జిల్లాలో గురువారం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సెంచరీ దాటింది. 2,316 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి 2,203 నమూనాలకు నిర్ధారణ పరీక్షలు చేయగా ఏకంగా 101 మంది పాజిటివ్‌ నివేదికలు వెలువడ్డాయి. వీరిలో రిమ్స్‌లో అయిదుగురు విద్యార్థులు ఉన్నారు. మరో ఇద్దరు సిబ్బంది పాజిటివ్‌ బారిన పడ్డారు. అత్యధికంగా ఉట్నూర్‌లో 14 మంది ఉన్నారు. కోలుకున్న 25 మందిని డిశ్ఛార్జీ చేశారు. క్రియాశీల కేసుల సంఖ్య జిల్లాలో 378కి చేరింది. ఇందులో 18 మంది రిమ్స్‌లో చికిత్సలు పొందుతుండగా, 360 మంది ఇళ్ల వద్ద క్వారంటైన్‌ అయ్యారు.

ప్రభావిత ప్రాంతాలు: ఉట్నూర్‌లో 14 మంది, ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌కాలనీలో 11, రిమ్స్‌లో ఏడుగురు, రాంనగర్‌(ఆదిలాబాద్‌), బోథ్‌లో అయిదుగురు చొప్పున, అశోక్‌రోడ్డు, శాంతినగర్‌ కాలనీల్లో నలుగురేసి, పట్టణంలోని ధోబికాలనీ, కొత్తహౌజింగ్‌బోర్డు, సరస్వతినగర్‌, సుభాష్‌నగర్‌ కాలనీల్లో ముగ్గురు చొప్పున, దస్నాపూర్‌, సాయినగర్‌, సీసీఐ జీడీసీ కాలనీ, సంజయ్‌నగర్‌, ఖానాపూర్‌, రవీంద్రనగర్‌, బోయవాడ(ఉట్నూర్‌)లో ఇద్దరేసి, భీంసరి, చాందా(టి), కేసీబీ గార్డెన్‌ ప్రాంతం, హనుమాన్‌నగర్‌(ఉట్నూర్‌), బజార్‌హత్నూర్‌, సిర్సన్న(బేల), భీంపూర్‌, బ్రాహ్మణ్‌వాడ, చిలుకూరిలక్ష్మీనగర్‌, మహాలక్ష్మీవాడ, శివాజీచౌక్‌, పిప్పర్‌వాడ(జైనథ్‌), గుడిహత్నూర్‌, క్రాంతినగర్‌, తిలక్‌నగర్‌, కూర(జైనథ్‌), ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌, తపాలా క్వార్టర్లు, పుత్లీబౌలి, బృందావన్‌కాలనీ, తలమడుగు, హస్నాపూర్‌(తాంసి), లక్కారం(ఉట్నూర్‌), చందూరి(ఉట్నూర్‌), నార్నూర్‌లో ఒక్కొక్కరు కొవిడ్‌ బారిన పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని