logo

సర్కారు వైద్యమే దిక్కు.. పట్టించుకుంటే ఒట్టు

జిల్లాలో ఎక్కువ మంది గిరిజనులే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో అడవి బిడ్డలకు సర్కారు వైద్యమే దిక్కు. ఎంత పెద్ద సమస్య అయినా ప్రభుత్వ ఆసుపత్రికే వెళతారు. అక్కడ కాదంటే దేవుడిపై భారం వేస్తారు తప్ప ప్రైవేటుకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు.

Published : 13 Aug 2022 05:37 IST

ఆసుపత్రుల్లో వైద్యుల కొరత..
ఏజెన్సీలో ఏళ్లుగా ఇబ్బందులు
లింగాపూర్‌(జైనూరు), న్యూస్‌టుడే

జిల్లాలో ఎక్కువ మంది గిరిజనులే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో అడవి బిడ్డలకు సర్కారు వైద్యమే దిక్కు. ఎంత పెద్ద సమస్య అయినా ప్రభుత్వ ఆసుపత్రికే వెళతారు. అక్కడ కాదంటే దేవుడిపై భారం వేస్తారు తప్ప ప్రైవేటుకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. కానీ ఇక్కడి ఆసుపత్రుల్లో సరిపడా వైద్య సిబ్బంది లేక గిరిపుత్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఐటీడీఏ ఉట్నూర్‌ పరిధిలోని ఆసుపత్రులను పటిష్ఠం చేయాల్సిన పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందడం లేదు.
ఏజెన్సీ మండలాలైన జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, కెరమెరి, తిర్యాణిలో ఏటా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇక్కడి మండలాల్లో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎం, పర్యవేక్షక్షులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది కలిపి 60కు పైగా ఖాళీలున్నాయి. దీంతో అత్యవసర వేళల్లో దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

అన్నిచోట్లా అరకొర సిబ్బంది..
జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, కెరమెరి, తిర్యాణి మండలాల్లో రెండు ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక కేంద్రాలు ఆరు ఉండగా.. వాటిలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు నాలుగు ఉన్నాయి. దీంతోపాటు 29 ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా సేవలందిస్తున్నారు. ఆయాచోట్ల 18 మంది వరకు వైద్యాధికారులు ఉండాల్సింది.. కేవలం ఎనిమిది మందితో నెట్టుకొస్తున్నారు. 10 మంది వైధ్యాధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 16 మంది రెండో ఏఎన్‌ఎంలు ఖాళీలు ఉండగా.. ఇందులో తిర్యాణి మండలంలో 10 ఖాళీలు ఉన్నాయి. ఏఎన్‌ఎం, సూపర్‌ వైజర్‌, హెల్త్‌ అసిస్టెంట్, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ అసిస్టెంట్ ఇలా మొత్తం 36 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. లింగాపూర్‌ ఆసుపత్రిలో అంబులెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో మండల ప్రజలకు అత్యవసర పరిస్థితిలో రోగులను జైనూర్‌, ఉట్నూర్‌, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడానికి జైనూర్‌ లేదా సిర్పూర్‌(యు) నుంచి 108 వాహనం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.


ప్రభుత్వానికి నివేదించాం..
- ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి, కుమురం భీం జిల్లా

ఆసుప్రతుల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో నాణ్యమైన సేవలు అందజేస్తున్నాం. సిబ్బంది లేనిచోట అదనపు బాధ్యతలు అప్పగించి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గిరిజన గ్రామాల్లో ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం.


ప్రభుత్వానికి నివేదించాం..
- ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి, కుమురం భీం జిల్లా

ఆసుప్రతుల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో నాణ్యమైన సేవలు అందజేస్తున్నాం. సిబ్బంది లేనిచోట అదనపు బాధ్యతలు అప్పగించి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గిరిజన గ్రామాల్లో ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని