logo

నేత్రపర్వం.. సీతారాముల కల్యాణోత్సవం

పల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు,

Published : 18 Apr 2024 04:26 IST

ఆదిలాబాద్‌లో.. శ్రీరాముడికి, సీతమ్మకు తలంబ్రాలు పోస్తూ..

ల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు, మాంగల్యధారణ అద్భుత ఘట్టాలను కనులారా వీక్షించిన భక్తులు ఆనంద పరవశం చెందారు. జిల్లా కేంద్రంలోని రామాలయాల్లో కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించారు. జానకీరాముడు సర్వ మానవాళికి ఆదర్శమని వేద పండితులు పేర్కొన్నారు. సాయంత్రం పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు.

ఈనాడు, ఆదిలాబాద్‌,
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ సాంస్కృతికం  

శోభాయాత్రలో అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌

ఆకట్టుకున్న యువతుల నృత్యం

చాందా(టి)లో హాజరైన భక్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని