logo

ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..

తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్‌ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు.

Updated : 20 Apr 2024 06:37 IST

అఫిడవిట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెల్లడి

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్‌ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. శుక్రవారం ఆమె తరఫున ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నామపత్రం దాఖలు చేయగా.. అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులతో సహా తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రజల ముంగిట ఉంచారు. ఇటీవల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసినట్లు వివరించిన ఆమె ఉట్నూరు, ఇంద్రవెల్లి, సిర్పూర్‌(యు), తాడ్వాయి(ములుగు జిల్లా) పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు వివరించారు. కేసు నెంబర్లు, సెక్షన్లను ప్రస్తావించినా ఏ సందర్భంలో ఆ కేసులు నమోదయ్యాయో వెల్లడించలేదు. ఈ కేసులన్నీ ప్రజా ఉద్యమంలో భాగంగా నమోదైనవేనని తెలుస్తోంది. భర్త ఆత్రం భుజంగరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా.. ఇద్దరు కుమారులు ఉన్నట్లు వివరించారు.

ఆదాయపన్ను రిటర్ను వివరాలు ఇలా..: 2023-24 సంవత్సరంలో తన పేరిట రూ.5,64,170 ఆదాయం ఉందని చూపించగా.. తన భర్త పేర రూ.19,08,010 ఆదాయం ఉన్నట్లుగా ఆదాయపన్ను రిటర్ను నివేదికలో ప్రస్తావించారు. ఇద్దరు కుమారుల పేర ఎలాంటి ఆస్తులులేవని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని