logo

వణికిస్తున్న మలేరియా

జులై, ఆగస్టు నెలల్లో అంచనాలకు మించి పాజిటివ్‌లు నమోదవడం వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాదితో పోల్చితే వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో కేసులు పెరుగుతూ వస్తున్నాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Published : 04 Oct 2022 02:38 IST

జిల్లావ్యాప్తంగా 688 పాజిటివ్‌ కేసుల నమోదు
పాడేరు, న్యూస్‌టుడే

జులై, ఆగస్టు నెలల్లో అంచనాలకు మించి పాజిటివ్‌లు నమోదవడం వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాదితో పోల్చితే వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో కేసులు పెరుగుతూ వస్తున్నాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

జిల్లావ్యాప్తంగా మలేరియా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఎక్కువమంది ఈ జ్వరాల బారిన పడకుండా వీలైనంత వరకు కట్టడి చేశారు. మలేరియా తగ్గుముఖం పట్టిందని వైద, ఆరోగ్య శాఖాధికారులు పైకి చెబుతున్నా.. గత మూడు నెలల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు అందరినీ కలవర పరుస్తున్నాయి. జూన్‌లో 126కు పైగా కేసులు నమోదు కాగా, జులైలో ఈ సంఖ్య 193కు చేరుకుంది.

ఆగస్టులో 97, సెప్టెంబరులో 53 మంది చొప్పున మలేరియా బారిన పడ్డారు.

మలేరియా కారక దోమల నియంత్రణకు ఏటా రెండు విడతల్లో దోమల నివారణ మందు పిచికారీ పనులు చేపడతారు. ఈ క్రమంలో జ్వరాలు ఎక్కువగా వ్యాపించే (హైరిస్క్‌) 1643 గ్రామాలను గుర్తించారు. మొదటి విడత ఏప్రిల్‌ 15 నుంచి 45 రోజులపాటు ఈ గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. రెండో విడతలో భాగంగా జులై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పిచికారీ పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.


పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బది

నిర్లక్ష్యం చేయలేదు..
మలేరియా అదుపులోనే ఉంది. జ్వరాల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు క్రమం తప్పకుండా తీసుకుంటున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో పిచికారీ పనులు పూర్తి చేశాం. ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తున్నాం. ఆరోగ్య కేంద్రాల వారీగా రక్తపూతలు సేకరిస్తున్నాం. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే సూచనలు, సలహాలు అందిస్తున్నాం. ఇటీవల పడిన అధిక వర్షాలతో కేసులు కొంతమేర పెరిగాయి. వీటిని నియంత్రించే చర్యల్లో భాగంగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం.

- సాంబమూర్తి, జిల్లా మలేరియాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని