logo

అలాగే వదిలేశారు!

ఇటీవల మారేడుమిల్లి నుంచి పుల్లంగి వెళ్లే రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా గతంలో ఉన్న కల్వర్టులను వెడల్పు చేశారు. కూడూరులో కల్వర్టు విస్తరణ పనులు పూర్తి చేశారు.

Published : 30 Mar 2023 03:10 IST

కూడూరు వద్ద కల్వర్టు విస్తరించిన ప్రదేశంలో ప్రమాదకరంగా ఉన్న రహదారి

న్యూస్‌టుడే, మారేడుమిల్లి: ఇటీవల మారేడుమిల్లి నుంచి పుల్లంగి వెళ్లే రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా గతంలో ఉన్న కల్వర్టులను వెడల్పు చేశారు. కూడూరులో కల్వర్టు విస్తరణ పనులు పూర్తి చేశారు. ఆ ప్రదేశంలో నిర్మాణ సామగ్రి అలాగే వదిలేయడంతో రహదారి అస్తవ్యస్తంగా మారింది. దీనిని సరిచేయకపోవడంతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశాన్ని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు