logo

భవిత బాగుకు కూటమి గెలవాలి

పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు.

Published : 29 Mar 2024 02:32 IST

 మాట్లాడుతున్న కొణతాల రామకృష్ణ, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే పీలా, బుద్ద తదితరులు
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), కశింకోట, న్యూస్‌టుడే: పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్న వారితో కలిసి నడిచారు. అధికారంలోకి రాగానే మార్కెట్‌ యార్డు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లిలో శారదా ట్యాంక్‌ బండ్‌ పార్కు నిర్మిస్తామన్నారు. ఉమ్మలాడ బ్యారేజ్‌ వరకు విస్తరించి స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. యోగా శిక్షకులతో పిల్లలకు ఉచితంగా యోగాపై శిక్షణ ఇస్తామని చెప్పారు. అనకాపల్లిలో ప్రభుత్వ అధికారులు అందరూ నివాసం ఉండే విధంగా భవన సముదాయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ మళ్ల సురేంద్ర, వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు గౌరీపతి, ఎస్‌ఎఫ్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 84వ వార్డు పరిధిలోని గొల్ల వీధిలో బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదంశెట్టి నీలబాబు ఆధ్వర్యంలో ‘కాఫీ విత్‌ క్యాడర్‌’ కార్యక్రమం నిర్వహించారు. కొణతాల మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం యువత కూటమికి అండగా నిలవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌, తెదేపా జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కశింకోట: నర్సింగబిల్లి, చింతలపాలెం గ్రామాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొణతాల సమక్షంలో 50 మంది యువకులు జనసేనలో చేరారు. మురళీధô్, శ్రీనివాసరావు, రమణమూర్తి నిరంజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 ఎలమంచిలి, రాంబిల్లి: వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని కూటమి అభ్యర్థి సుందరపు విజయకుమార్‌ పేర్కొన్నారు. హరిపురంలోని జనసేన కార్యాలయంలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొద్దపు మణి భర్త దాసు, రాజకోడూరు సర్పంచి శంకరరావు, ఉప సర్పంచి కొరుప్రోలు దేవి మాణిక్యాలరావు, వార్డు సభ్యులు లాలం తాతారావు, సూరిశెట్టి సత్యవతి, ముత్తా అరుణకుమారితోపాటు మరో 50 మంది కార్యకర్తలు పార్టీలో చేశారు. ఎలమంచిలి పరిధిలోని మంత్రిపాలెం, నాగేంద్ర కాలనీలకు చెందిన ఊడిబాబులు అనుచరులతో జనసేనలో చేరారు. సత్యనారాయణ, శ్రీనివాసరావు, శేఖర్‌, రామదాసు, చందు, శివశంకర్‌, శ్రీరాందాసు, నూకన్నదొర, ప్రసాద్‌, నానాజీ పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు