logo

జీవో నం 3 రద్దుతో తీవ్ర నష్టం

సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఆదివాసీ అభ్యర్థులు గిరిజన చట్టాలు, హక్కులపై తమ వైఖరి తెలియజేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోచలి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Published : 16 Apr 2024 02:07 IST

చింతపల్లిలో మాట్లాడుతున్న గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఆదివాసీ అభ్యర్థులు గిరిజన చట్టాలు, హక్కులపై తమ వైఖరి తెలియజేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోచలి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యూవీ గిరితో కలిసి స్థానిక గిరిజన ఉద్యోగ భవనం వద్ద మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు గిరిజన చట్టాలు, హక్కులు అమలయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. జీవో నంబరు 3 రద్దుతో చదువుకున్న గిరి యువత ఉద్యోగం, ఉపాధి లేక గంజాయి,  తదితర వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ప్రజలు గిరిజన చట్టాలను రక్షించే వారికే మద్దతు తెలపాలని సూచించారు. సీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుముల వెంకటరమణ, మండల గౌరవ అధ్యక్షుడు శశికుమార్‌, బౌడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని