logo

62 కేజీల గంజాయి పట్టివేత

రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్‌ ఎస్సై శివకుమార్‌ తెలిపారు.

Published : 19 Apr 2024 01:54 IST

పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు

మోతుగూడెం, న్యూస్‌టుడే: రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్‌ ఎస్సై శివకుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వై.రామవరం డిప్యూటీ తహసీల్దార్‌ సుధాకరరావు, వీఆర్వో సందీపాచార్యులు సమక్షంలో తన సిబ్బందితో పోలీసు స్టేషన్‌ చెక్‌పోస్టు వద్ద బుధవారం వాహన తనిఖీలు చేసినప్పుడు గంజాయి పట్టుబడిందన్నారు. తొలుత ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లకు చెందిన పెనుమల బాబు, పర్వతం సురేష్‌ను అరెస్టు చేసి రూ.పది వేల విలువైన రెండు కేజీల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీలోని బర్రిగూడ గ్రామానికి చెందిన కిలో రాందాస్‌, తెలంగాణ రాష్ట్రం చిట్యాలకి చెందిన గొర్రె కృష్ణలను అరెస్టు చేసి రూ. 3 లక్షల విలువైన 60 కేజీల గంజాయి, ఆటోను సీజ్‌ చేశారు. నిందితులను రంపచోడవరం కోర్టుకు తరలించామన్నారు. ఈ రెండు కేసుల్లో గంజాయి అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి, నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన హెడ్‌ కానిస్టేబుళ్లు కల్యాణ్‌, శ్రీనివాసరావు, ఆర్‌.శ్రీనివాస్‌ గౌడ్‌, కానిస్టేబుళ్లు పోసయ్య, గంగరాజులను అదనపు ఎస్పీ రాహుల్‌ మీనా, సీఐ గజేంద్ర కుమార్‌, ఎస్సై శివకుమార్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని