logo

రెండో రోజు నామినేషన్ల సందడి

నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ తెలిపారు.

Published : 20 Apr 2024 02:24 IST

పాడేరు, న్యూస్‌టుడే: నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ తెలిపారు. బీఎస్పీ అభ్యర్థి లకే రాజారావు ఒకటి, భాజపా అభ్యర్థి పాంగి రాజారావు రెండు సెట్లు నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులు రఘునాథ్‌, గులాబి, సివేరి అబ్రహం ఒక్కొక్క సెట్‌ నామపత్రాలు సమర్పించారు.

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి శుక్రవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి, సంయుక్త కలెక్టర్‌ భావన తెలిపారు. తెదేపా అభ్యర్థి కిల్లు వెంకటరమేశ్‌    నాయుడు, వైకాపా తరఫున మత్స్యరాస విశ్వేశ్వరరాజు నామపత్రాలు సమర్పించారు.

నామినేషన్ల సందర్భంగా జిల్లా కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. అభ్యర్థులు భారీ ర్యాలీలతో పాడేరు చేరుకున్నారు. పాంగి రాజారావు ర్యాలీలో ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ఆయన వెంట ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర ఉన్నారు. పాడేరు, చింతపల్లి ఏఎస్పీలు ధీరజ్‌, శివ కిషోర్‌, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.

రెండో రోజు తొమ్మిది నామినేషన్లు .. జిల్లా పరిధిలో శుక్రవారం తొమ్మిది నామినేషన్లు దాఖలు అయ్యాయి. అరకు అసెంబ్లీలో ఆరు, పాడేరు అసెంబ్లీలో రెండు, రంపచోడవరం అసెంబ్లీలో ఒకటి చొప్పున నామినేషన్లు సమర్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని