logo

మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి

ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు.

Updated : 24 Apr 2024 04:52 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. మండలంలోని సీతంపాలెం, పెదదొడ్డిగల్లు తదితర గ్రామాల్లో మంగళవారం ఆమె తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లిన ఆమెకు మహిళలు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు. వారందరికీ మేనిఫెస్టో కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ మద్యం నిషేధం అటకెక్కించారని, ఉచిత ఇసుక రద్దుచేసి సొమ్ము చేసుకున్నారని, ఉద్యోగాలు, ఉపాధి లేకుండా యువత జీవితాలతో ఆటలు ఆడారని విమర్శించారు. దోపిడీయే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగించి, ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే ఏప్రిల్‌ నెల నుంచే రూ. నాలుగు వేలు పింఛను అమలు చేస్తారని, ఉచిత ఇసుక, రెండు నెలల్లో మెగా డీఎస్సీ తీస్తారని వివరించారు. మసీదు వద్ద ప్రార్థనల్లో అనిత పాల్గొన్నారు. గీత కార్మికుల కరపత్రాలను ఆ సంఘం నాయకులు గుర్తుర్తి పాండురంగ, ఒనుం శ్రీనివాసరావు తదితరులతో కలిసి అనిత విడుదల చేశారు. కార్యక్రమాల్లో కొప్పిశెట్టి వెంకటేష్‌, కురందాసు నూకరాజు, వెలగా సుధాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు