logo

30న పెడనలో మెగా ఉద్యోగ మేళా

ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ, సీడ్‌ ఏపీ, ఉద్యోగకల్పనా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30న ఉదయం 9 గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు.పెడన నియోజకవర్గం

Published : 27 Sep 2022 05:33 IST

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ, సీడ్‌ ఏపీ, ఉద్యోగకల్పనా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30న ఉదయం 9 గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు.పెడన నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోని యువతీ, యువకులకు మంత్రి జోగి రమేష్‌ సారథ్యంలో స్థానిక సెయింట్‌ విన్సెంట్‌ పల్లోటి ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఉద్యోగ మేళాలో 19 కంపెనీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పదో తరగతి నుంచి ఐటీఐ, డిప్లొమో, ఇంటర్‌, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్‌, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ పాల్గొనవచ్చునని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ‌www.apssdc.in వెబ్‌సైట్లో తమ పూర్తి వివరాల్ని నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రెజ్యూమ్‌తో పాటు ఆధార్‌, విద్యార్హత ధ్రువపత్రాల నకళ్లతో హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్‌ నంబర్‌లో 7981 368429 సంప్రదించాలని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని