logo

కేసీపీలో క్రషింగ్‌ ప్రారంభం

ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారంలో 2022-23 సీజన్‌కు క్రషింగ్‌ను ప్రధాన కార్యనిర్వహణాధికారి వై.సీతారామదాసు బుధవారం ప్రారంభించారు.

Published : 08 Dec 2022 05:07 IST

స్విచ్‌ ఆన్‌ చేస్తున్న కర్మాగార ప్రధాన కార్యనిర్వహణాధికారి సీతారామదాస్‌

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారంలో 2022-23 సీజన్‌కు క్రషింగ్‌ను ప్రధాన కార్యనిర్వహణాధికారి వై.సీతారామదాసు బుధవారం ప్రారంభించారు. ముందుగా ఆయన కర్మాగార ప్రాంగణంలో పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1.04 గంటలకు స్విచ్‌ ఆన్‌ చేసి గానుగను ప్రారంభించారు. ప్రస్తుతం సీజన్‌కు 11,701 ఎకరాల్లో చెరకు సాగువుతోందని, సుమారు 4.20 లక్షల టన్నుల చెరకును గానుగాడే లక్ష్యంగా ఉన్నామని కేసీపీ వ్యవసాయ విభాగం జనరల్‌ మేనేజరు వి.వి.పున్నారావు తెలిపారు. ఈ ఏడాది అనుకూల వాతావరణం వలన ఎకరాకు 36 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని, రివకరీ కూడా గతేడాది కంటే పెరిగే సూచనలున్నాయన్నారు. అసిస్టెంట్‌ కేన్‌ కమిషనరు ముత్యాలు, చెరకు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త నాగేంద్రరావు, కేసీపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు ఎస్వీ కృష్ణారావు, కేసీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు, పలువురు శాస్త్రవేత్తలు, కేసీపీ అధికారులు, రైతు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని