logo

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

అంతరాష్ట్ర దొంగలు శొంఠి దుర్గారావు, పులి రమేష్‌ను అరెస్టు చేసి, వారి నుంచి చోరీ సొత్తు రూ.18.50 లక్షల విలువైన పసిడి, వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Published : 21 Mar 2023 04:48 IST

రూ.18.50 లక్షల పసిడి, వెండి ఆభరణాలు స్వాధీనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు

బాపట్ల, న్యూస్‌టుడే: అంతరాష్ట్ర దొంగలు శొంఠి దుర్గారావు, పులి రమేష్‌ను అరెస్టు చేసి, వారి నుంచి చోరీ సొత్తు రూ.18.50 లక్షల విలువైన పసిడి, వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిందితుల  వివరాలు వెల్లడించారు. మచిలీపట్నానికి చెందిన శొంఠి దుర్గారావు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, ఒడిశా, కేరళ, తమిళనాడులో చోరీలకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోనూ పలు పోలీస్‌స్టేషన్లలో అతడిపై చోరీ కేసులు ఉన్నాయి. గుంటూరుకు చెందిన పులి రమేష్‌ పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. గుంటూరు సబ్‌జైలులో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. గత ఫిబ్రవరి 11న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. దుర్గారావు అంతకుముందే గత జనవరిలో జైలు నుంచి బయటకు వచ్చాడు. జల్సాలకు అలవాటు పడిన వీరు నగదు కోసం ఈ నెల 6న బాపట్ల పట్టణంలో ఎస్‌ఎన్‌పీ అగ్రహారం, పాత తపాలా కార్యాలయం రోడ్డులోని ఓ ఇంటిలో, 8న కారుమూరి హనుమంతరావు కాలనీలోని మరో ఇంట్లోకి చొరబడి రూ.లక్షల విలువైన పసిడి, వెండి ఆభరణాలు అపహరించారు. ఘటనలపై బాపట్ల పట్టణ పోలీస్‌స్టేషన్లో చోరీలపై కేసులు నమోదయ్యాయి. సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగి పట్టణ పోలీసుల సహకారంతో నిందితులను చీరాల రోడ్డులోని కంకటపాలెం జంక్షన్‌ వద్ద సోమవారం పట్టుకున్నారు. నిందితుల నుంచి బాపట్ల, చీరాల, ఏలూరులో చోరీ చేసిన 302 గ్రాముల బంగారు, 1.35 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగల్ని పట్టుకుని ఆభరణాలు రికవరీ చేసిన పట్టణ సీఐ కృష్ణయ్య, సీసీఎస్‌ సీఐ మురళీకృష్ణ, పట్టణ ఎస్సై రఫీ, ఏఎస్సై ధనుంజయరావును ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఏఎస్పీ మహేష్‌, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని