logo

వాగులో పడిన ప్రధానోపాధ్యాయుడు

ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడిన ఘటన మండలంలోని పల్లంపల్లి సమీపంలోని వైరా-కట్టలేరు వాగు వద్ద చోటు చేసుకుంది.

Published : 21 Mar 2023 04:48 IST

కాపాడిన స్థానికులు

వాగులో చిక్కుకున్న ఆదాం

పల్లంపల్లి(వీరులపాడు), న్యూస్‌టుడే : ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడిన ఘటన మండలంలోని పల్లంపల్లి సమీపంలోని వైరా-కట్టలేరు వాగు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు...ఎన్టీఆర్‌ జిల్లా విసన్నపేటకు చెందిన ఎం.ఆదాం మండలంలోని జయంతి ఎంపీపీ(దళితవాడ) పాఠశాలలో ఎల్‌.ఎఫ్‌.ఎల్‌ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం పాఠశాలలో విధులు ముగించుకున్న అనంతరం నందిగామలో నివాసముంటున్న తన కూతురిని చూడడానికి ద్విచక్ర వాహనం(రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌)పై వెళుతుండగా పల్లంపల్లి సమీపంలోని వైరా-కట్టలేరు వాగు వద్ద చప్టాపై ప్రవహిస్తున్న వరద నీటిలో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. వాహనంతో పాటు వరద నీటిలో కొంత దూరం కొట్టుకుపోయిన ఆదాం చప్టా పక్కనే నిర్మించిన వంతెన పిల్లరును పట్టుకొని నిలబడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తాడు సహాయంతో ఆయనను రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.  ద్విచక్ర వాహనం వెలికి తీయడం సాధ్యం కాలేదు. చప్టా పూర్తిగా శిథిల స్థితికి చేరుకుందని, గత ప్రభుత్వంలో వంతెన నిర్మించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం అప్రోచ్‌ రహదారిని నాలుగు సంవత్సరాలుగా పూర్తి చేయలేకపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో ఈ చప్టాపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని వాపోతున్నారు.

తాడు సహాయంతో తీసుకొస్తున్న యువకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు