కీచక ప్రిన్సిపల్ అరెస్టు
అత్యాచారం కేసులో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డికి కోర్టు రిమాండ్ విధించినట్లు విజయవాడ డీసీపీ వేజెండ్ల అజిత తెలిపారు. కేసు విషయమై నగరంలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు.
విజయవాడ(చిట్టినగర్), న్యూస్‌టుడే : అత్యాచారం కేసులో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డికి కోర్టు రిమాండ్ విధించినట్లు విజయవాడ డీసీపీ వేజెండ్ల అజిత తెలిపారు. కేసు విషయమై నగరంలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ విజయవాడ గ్రామీణ ప్రాంతంలోని అంబాపురం పంచాయతీ పరిధిలో ఇన్‌స్టిట్యూట్ ఆప్ పారామెడికల్ అండ్ అలైడ్ సైన్సెస్ హెల్త్ కళాశాల, ఫణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలను ప్రిన్సిపల్ బసిరెడ్డి రవీంద్రరెడ్డి నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఆ కళాశాలలో చదివిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. తాము దర్యాప్తు చేపట్టామని, అలాగే ఐసీడీఎస్, ఛైల్డ్ వెల్ఫేర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి విచారించమని కోరామన్నారు. నిందితుడిపై 376 (2) (ఎఫ్), 376 (2) (ఎన్), ఐపీసీ అండ్ సెక్షన్ 3 (2) (వి) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (పీఓఏ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆమె వివరించారు. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని నిందితుడిని అరెస్టు చేసి శిక్ష పడేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆదేశించారన్నారు. తన పర్యవేక్షణలో పశ్చిమ ఏసీపీ కె.హనుమంతరావు, కొత్తపేట సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పూర్తి స్థాయిలో విచారించి నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు వివరించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ