logo

త్వరలో విత్తన పంపిణీ

ఖరీఫ్‌కు రాయితీ వేరుసెనగ విత్తన పంపిణీ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని వ్యవసాయ సంయుక్త సంచాలకులు చంద్రనాయక్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి రైతు భరోసా కేంద్రాలకు వేరుసెనగ కాయలను లారీల్లో తరలించే ప్రక్రియ వేగవంతం చేశామని తెలిపా

Published : 25 May 2022 04:49 IST

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌కు రాయితీ వేరుసెనగ విత్తన పంపిణీ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని వ్యవసాయ సంయుక్త సంచాలకులు చంద్రనాయక్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి రైతు భరోసా కేంద్రాలకు వేరుసెనగ కాయలను లారీల్లో తరలించే ప్రక్రియ వేగవంతం చేశామని తెలిపారు. మంగళవారం అనంతలోని గుత్తిరోడ్డులో వేరుసెనగ శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేశారు. విత్తనకాయల నాణ్యతను తూకం వేసి సరిచూశారు. రాళ్లు, బొటికెలు, పుల్లలు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. విత్తనాలు బాగా లేకపోతే లారీని వెనక్కి పంపించాలన్నారు. జిల్లాకు 1.10 లక్షల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనకాయలు కేటాయించగా ఇప్పటికే 90 వేల క్వింటాళ్లు సేకరించడం జరిగిందన్నారు. అందులో 35 వేల క్వింటాళ్ల వరకు శుద్ధి చేసి ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి ఆర్‌బీకేలకు సరఫరా చేసి, నిల్వ చేశామని జేడీఏ వివరించారు. ఆర్‌బీకేల్లో రైతుల పేర్ల నమోదు ప్రక్రియ సాగుతోందని, ఇప్పటికే 11 వేల మంది రైతులు 14 వేల క్వింటాళ్లు విత్తనాలు కావాలని నమోదు చేసుకున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని