logo

పురంలో బాలయ్య ర్యాలీ

ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు.

Published : 20 Apr 2024 03:41 IST

ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం అర్బన్‌: ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. పట్టణంలోని సూగూరు దేవాలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షో జనంతో రహదారులు కిక్కిరిశాయి. జనం జేజేలు మధ్య బాలకృఫ్ణ రోడ్‌షో ప్రారభించగా జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. వాల్మీకి కూడలిలో మైనార్టీ నాయకులు ప్యారూసాబ్‌, హిదాయత్‌ కుటుంబ సభ్యులు గజమాలతో బాలయ్యకు ఘనస్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని