logo

ఉజ్వలకే ఊరట.. 2 వేల మందికే ప్రయోజనం

కేంద్ర ప్రభుత్వం గృహావసరాల గ్యాస్‌ సిలిండరు ధరను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెరుగుతున్న గ్యాస్‌ ధరల వల్ల ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి ఒక్కసారిగా ధరలు తగ్గినట్లు కేంద్ర ప్రకటనతో సంతోషపడ్డారు. ధర తగ్గింపు ప్రధానమంత్రి

Updated : 23 May 2022 05:48 IST

 

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం గృహావసరాల గ్యాస్‌ సిలిండరు ధరను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెరుగుతున్న గ్యాస్‌ ధరల వల్ల ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి ఒక్కసారిగా ధరలు తగ్గినట్లు కేంద్ర ప్రకటనతో సంతోషపడ్డారు. ధర తగ్గింపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్‌ లబ్ధిదారులకే వర్తిస్తుందని కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గింపు నగదు రూ.200 ఉజ్వల యోజన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ విధానంలో జమ చేయనుంది. దీంతో సాధారణ గ్యాస్‌ వినియోగదారుల ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్‌ లబ్ధిదారులు కేవలం రెండు వేల నుంచి 2,500 మంది లబ్ధిదారులే ఉన్నట్లు సమాచారం. వీరికి మాత్రమే గ్యాస్‌ ధర తగ్గింపు వర్తిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 11.10 లక్షల గృహావసరాల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. 110 గ్యాస్‌ సరఫరా ఏజెన్సీలు ఉన్నాయి. తెదేపా ప్రభుత్వ పాలనలో జిల్లాను పొగ రహితంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దీపం పథకం కింద అధిక సంఖ్యలో గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత భాజపా ప్రభుత్వం ఉజ్వల కింద గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేసినప్పటికీ అప్పటికే 80-90శాతం కుటుంబాలకు కనెక్షన్లు ఉండటంతో ఉజ్వల యోజన తక్కువ సంఖ్యలో ప్రజలకు లబ్ధి చేకూరింది. కేంద్ర ప్రభుత్వం సిలిండరు ధర తగ్గించినా జిల్లా గ్యాస్‌ వినియోగదారులకు ఎలాంటి ఆర్థిక చేయూత దక్కలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని