logo

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు పుంగనూరు ఎంపిక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021-22 ఏడాదికి గానూ పుంగనూరు పురపాలక జాతీయస్థాయి స్వచ్ఛ అవార్డుకు ఎంపికైందని పురపాలక కమిషనరు నరసింహప్రసాద్‌ తెలిపారు.

Published : 25 Sep 2022 02:31 IST

పురపాలక కార్యాలయం

పుంగనూరు, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021-22 ఏడాదికి గానూ పుంగనూరు పురపాలక జాతీయస్థాయి స్వచ్ఛ అవార్డుకు ఎంపికైందని పురపాలక కమిషనరు నరసింహప్రసాద్‌ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అక్టోబరు ఒకటిన దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నట్లు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, పురపాలక ఛైర్మన్‌ అలీంబాషా, కౌన్సిలర్లు, అధికారులు, పురప్రజల సహకారంతో ఈ అవార్డును సాధించామన్నారు. పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని