logo

సారూ.. బిల్లులిచ్చి ఆదుకోండి!

హెల్త్‌క్లినిక్‌, డిజిటల్‌ లైబ్రరీ భవనాలు నిర్మించి ఏడాది అవుతున్నా నేటికీ రూపాయి బిల్లులు అందలేదని బిల్లులు అందించి ఆదుకోవాలని గుత్తేదారు వెంకటనరసింహారాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 26 Nov 2022 06:33 IST

హెల్త్‌క్లినిక్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న గుత్తేదారు

పాలసముద్రం, న్యూస్‌టుడే: హెల్త్‌క్లినిక్‌, డిజిటల్‌ లైబ్రరీ భవనాలు నిర్మించి ఏడాది అవుతున్నా నేటికీ రూపాయి బిల్లులు అందలేదని బిల్లులు అందించి ఆదుకోవాలని గుత్తేదారు వెంకటనరసింహారాజు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని నరసింహాపురం సచివాలయ పరిధిలో గతేడాది చేపట్టిన పనుల్లో హెల్త్‌ క్లినిక్‌ 80 శాతం, డిజిటల్‌ లైబ్రరీ 30 శాతం పూర్తయినా బిల్లులు రాలేదని వాపోయారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టానని.. వాటిని ఇప్పుడు చెల్లించలేక అవమానం పాలయ్యానన్నారు. కనీసం వడ్డీ కట్టలేక పోతున్నానన్నారు. బిల్లులపై డీఈఈ, ఈఈలకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేదని, అధికారులను అడిగితే.. నేడురేపంటూ కాలం గడుపుతున్నారని, ఇప్పటివరకు రూ.16 లక్షలు రావాల్సి ఉందని చెప్పారు. అధికారులు స్పందించి తనకు బిల్లులు ఇవ్వాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు