logo

ఏలుమలై మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

రామకుప్పం మండలం 89పెద్దూరు గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు, తెదేపా కార్యకర్త ఏలుమలై మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు.

Published : 29 Nov 2022 02:03 IST

డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

రామకుప్పం:  రామకుప్పం మండలం 89పెద్దూరు గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు, తెదేపా కార్యకర్త ఏలుమలై మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. శనివారం కర్నాటక రాష్ట్రం చింతామణిలో కూలి ఏలుమలై కూలి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య పవిత్రకు మూడు ఫోన్‌ నంబర్ల ద్వారా నీ భర్త హత్యకు గురయ్యాడని సమాచారం అందిందని తెలిపారు. ఏలుమలైను ఎస్‌.గొల్లపల్లికి చెందిన శివగామి, మురుగేష్‌, కాంతరాజ్‌లు హత్య చేసి ఆటోలో తరలిస్తుండగా స్థానికులు గమనించారని, ఈ క్రమంలోనే ననియాల ఏనుగుల సంరక్షణ కేంద్రం సమీప అటవీ ప్రాంతంలో విడిచి అటవీ ప్రాంతంలోకి పరారవుతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పవిత్ర హటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి విగతజీవిగా పడి ఉన్న ఏలుమలైని బంధువుల సహాయంతో రామకుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. మృతదేహాన్ని తరలిస్తున్న శివగామి, మురుగేష్‌, కాంతరాజ్‌లను స్థానికులు పోలీసులకు అప్పగించినా అధికార పార్టీకి చెందిన వారి కోరిక మేరకు వారిని విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నిందితులపై హత్య కేసుగా నమోదు చేసి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును కూడా చేర్చి వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని