logo

రాయలసీమకు జగన్‌ ద్రోహం

రాయలసీమకు జగన్‌ ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో పరిశ్రమల విషయంలో ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

Published : 04 Dec 2022 03:48 IST

మాజీ మంత్రి అమరనాథరెడ్డి ధ్వజం

సమావేశంలో మాట్లాడుతున్న అమరనాథరెడ్డి, తెదేపా నాయకులు

పలమనేరు, న్యూస్‌టుడే: రాయలసీమకు జగన్‌ ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో పరిశ్రమల విషయంలో ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ‘పరిశ్రమలను జగన్‌ భయపెట్టి పంపేస్తున్నారు. పొల్యూషన్‌ కంట్రోలు బోర్డును అడ్డుపెట్టుకుని అమరరాజా పరిశ్రమను వెళ్లిపోమనడమే అందుకు నిదర్శనం. జగన్‌ తండ్రి కృష్ణాలో మిగులు జలాలను మేము అడగము అని కేంద్రానికి లేఖలు రాసిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. దాంతో గోదావరి, కృష్ణా జలాలపై ఈ రాష్ట్రం హక్కులు కోల్పోయినందుకు సీఎం సిగ్గుపడాలి. ఎన్టీరామారావు హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు బీజం వేస్తే దానికి రావాల్సిన నీటిని మాకు వద్దని మీ తండ్రి రాసివ్వడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌ ఎందుకు వెళ్లారు. నీ వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో స్టీల్‌ పరిశ్రమ ఎందుకు తేలేదు. కర్నూలులో హైకోర్టు పెట్టడానికి వీలులేదని ప్రభుత్వ అడ్వకేట్‌ ఎందుకు మాట్లాడారు. పరిశ్రమలు పోతుంటే రాయలసీమ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. మీరు జగన్‌కి బుద్ధి చెప్పి పరిశ్రమలను వెనక్కి తీసుకురాకుంటే రాజీనామా చేయండ’ని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని